రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ జిల్లా పల్లూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న లారీ ఓ కారును ఢీకొట్టింది.
కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత.. మృతదేహాలకు పోస్టుమార్ట పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.