నగరంలోని కూకట్పల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మెట్రోపిల్లర్ నెంబర్ 822 వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వినోద్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమంత్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.