కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. 9 మందికి గాయాలు అయ్యాయి. పట్టణలో కమాన్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా.. మొత్తం నలుగురు మృతి చెందారు.
తొమ్మిది మందికి గాయాలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారిలో ఒకరు ఘటనా స్థలంలోనే చనిపోగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు.
ప్రమాదం జరిగిన తరువాత కారును వదిలేసి నలుగురు యువకులు పరారయ్యారు. కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలు అని పోలీసులు చెప్పారు.