తెలంగాణ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. AP 09 BU 0990 అనే బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అదే వేగంతో ఎదురుగా వస్తున్న టాటా విస్టా కారు TS 05 UC 4666ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. రోడ్డంతా రక్తసిక్తంగా మారింది. ఓఆర్ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్ కేసర్ నుండి వస్తోన్న బెంజ్ కార్, షామీర్ పేట్ వైపు నుండి వస్తున్న టాటా కార్ ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఉహించని ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కాగా.. క్లియర్ చేసి వాహన రాకపోకలు పునరుద్ధరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.