మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక ముగించుకొని తిరిగి వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి, డ్రైవర్ సహా ఏడుగురు మృతిచెందారు.
ఈ ఘోర ప్రమాదం ఛింద్వాడా జిల్లాలోని కొడమావు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. జిల్లాకు చెందిన కొందరు వాహనంలో కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా ఓ బైక్ రైడర్ స్పీడ్ గా వచ్చాడు.
ఈ క్రమంలో బైక్ రైడర్ ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి లోయలో పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఏడుగురు అక్కడిక్కడే మరణించగా.. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రును స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లింట విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.