మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుడూరు మండలం మర్రిమిట్ట సమీపంలో లారీ- ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గుంజేడు ముసలమ్మ దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గూడూరు మండల వాసులుగా గుర్తించారు.
వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.