మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు మృతి చెందారు. చనిపోయిన నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వీరంతా కొన్నాళ్ల క్రితం బతుకు దెరువుకోసం గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు. ఐదు రోజుల క్రితం వీరి గ్రామంలో బంధువు మృతి చెందగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కుటుంబ సభ్యులను చౌటపల్లీలో ఉంచి, అన్నదమ్ములు తిరిగి కారులో సూరత్ కు బయల్దేరారు.
అదే రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.