మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పుణె- ముంబయి ఎక్స్ప్రెస్ వే పై లోనావ్లా, శిలాతనే గ్రామాల సమీపంలో ఓ కంటైనర్ను కారు ఢీకొట్టింది.
పుణె నుంచి ముంబయికి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. తరువాత ఎగిరి అవతలి వైపు పడింది. ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి దూసుకెళ్లింది. కారు మొత్తం నుజ్జునుజ్జ అయింది. కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. వేగంగా రావడంతో కారుని అదుపు చేయలేకపోయారని అన్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా హరియాణాకి చెందినవారని గుర్తించారు.