ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 80 మంది కూలీలతో వెళ్తున్న బస్సు దట్టమైన పొగమంచు కారణంగా అదుపు తప్పి చెరువులోనికి దూసుకకెళ్లింది.
ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది కూలీలు గాయపడ్డారు.స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారందరూ కూడా భిట్నకుల గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని రియూసాలోని హెల్త్ కేర్ కమ్యూనిటీ సెంటర్ కి తరలించారు.
తీవ్రంగా గాయపడిన కూలీలను సీతాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.