శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు . మృతులు సింహాచలం నుంచి బరంపురం వైపు వెళ్తుండగా కొత్తపల్లి బ్రిడ్జి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. తెల్లవారుజామున మంచు కప్పేయడంతో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.