యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బహ్రెయిచ్‌లో ప్రయాణీకులతో వెళుతున్న బస్సును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో లక్నో బ్రహాయిచ్ హైవేపే ప్రమాదం చోటు చేసుకుంది.
క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వారిని లక్నోలోని ట్రామా సెంటర్ కు తరలించారు. ప్రమాదం అయిన వెంటనే ట్రక్కును ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
దీంతో ట్రక్కు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దగ్గర్లోని డాబాలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. మంచు తీవ్రంగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండచ్చొని పోలీసులు అనుమానిస్తున్నారు.