తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో మోమిన్‌పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండా సమీపంలో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఇంకొకరు చనిపోయారు.
మృతులంగా ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందినవారుగా గుర్తించారు. పొగమంచు కారణంగా వాహనం కనిపించకపోవడం, లారీ, అర్టీసీ బస్సుల అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.