శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు మృతి చెందారు. కాళ్ల పారాణి ఇంకా ఆరకుండానే నూతన వధూవరులు ఇద్దరూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కలకాలం కలసి కాపురం చేయాలనుకున్న జంట పెళ్ళి అయిన మూడో రోజే మృత్యువాతపడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇచ్ఛాపురంకి చెందిన వేణు (21), ఒడిశాకు చెందిన ప్రవల్లిక(18)లు ఈనెల 10వ తేదీన సింహాచలంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 12వ తేదీన ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు.
అనంతరం సోమవారం ఇచ్ఛాపురం నుంచి ఒడిశాలోని అత్తవారింటికి వెళ్లేందుకు బైక్‌పై దంపతులు బయలుదేరారు. ఆసుపత్రికి చేర్చేలోపు వరుడు వేణు కూడా తుది శ్వాస విడిచాడు. ఈ విషాద ఘటన ఆ రెండు కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచేసింది.