తెలంగాణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పటాన్ చెరు, ఇస్నాపూర్ దగ్గర టిప్పర్ లారీ, ఆటో ఢీ కొట్టుకున్నాయి. అతి వేగంగా వచ్చిన టిప్పర్.. ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయలు అయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు గుర్తించడానికి కూడా కష్టంగా ఉందని పోలీసులు చెప్పారు. ఒకరి మృతదేహం చిద్రం అయిపోయిందని అన్నారు. గాయాలైన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.