చౌటుప్పల్ లక్కారం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది.
యాక్సిడెంట్ కారణంగా హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అదే సమయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. అతడ్ని కూడా ఆసుపత్రికి తరలించారు.