రంగారెడ్డి జిల్లాలో నార్సింగి వద్ద దారి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రక్త మైసమ్మ ఆలయ సమీపంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న ఇద్దరిపై తల్వార్లతో దాడి చేశారు.
కిషోర్ కుమార్ రెడ్డి, తులసిలపై దోపిడి దొంగలు విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో కిషోర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మరణించాడు.
తులసిపై దుండగులు దాడి చేయగా తులసి నాలుగు వేళ్లు తెగిపోయాయి. తులసి వద్ద ఉన్న రూ. 15 వేలను దొంగల ముఠా సభ్యులు దొంగిలించారు. దొంగల బారి నుంచి తులసి తప్పించుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.
అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.