బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. అయితే ఈ చిత్రం…తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తుంది.
ఏపీ, టీఎస్‌లలో రెండో రోజు కలెక్షన్లు నిలకడగా ఉండగా, ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. ఇప్పటి వరకు, ఈ చిత్రం ఉత్తర అమెరికాలో $ 580,000 వసూలు చేసింది. శని, ఆదివారాలు ఇదే ట్రెండ్ ఫాలో అయితే ఫస్ట్ వీకెండ్ లోనే మిలియన్ డాలర్ మార్క్ ని బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.