గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం లో 10 లక్షల చోరీ జరిగింది. సంక్షేమ కార్యక్రమాలకు కోసం ఉంచిన డబ్బును అపహరించారని వైకాపా నాయకుడు జూపూడి జాన్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తే ఈ చోరీకి పాలపడ్డారంటూ అనుమానం వ్యక్తం చేశారు. తెలియని వ్యక్తులు ఎవ్వరూ కూడా కార్యాలయం లోపలికి రాలేరని, కార్యలయంలో పనిచేసేవారో లేదా ఇక్కడ విషయాలు తెలిసినవారెవరో ఈ పనికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.
