రోబోలు ఇప్పటివరకూ వెయిటర్స్ గా, సరిహద్దులో సైనికులుగా పని చేయడం చూశాం. ఇప్పుడు పూజారి అవతారమెత్తింది రోబో. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. రోబోల ఆవిష్కరణతో ఆధునిక జీవితంలో అన్ని రంగాల్లో సేవలు సులభతరమవుతున్నాయి.
తమిళనాడులోని వెల్లూరులో వీఐటీ వర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో దసరా ఆయుధ పూజను నిర్వహించారు. ఈ ఆయుధ పూజలో ఒక రోబో దుర్గా మాతకు హారతి ఇస్తూంటే, ఇంకో రోబో గంట మోగించింది.
ఫనక్ ఎం-6ఐబి, ఆర్జే3ఐసీ అనే రెండు రోబోలను వెల్లూరులోని వీఐటీ వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్ధుల బోధనకు ఉపయోగిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఈ రోబోలు సిబ్బందికి సహకరించాయి. పూజ సందర్భంగా బ్యాక్‌గ్రౌండ్‌లో డిపార్ట్‌మెంట్ సిబ్బంది ప్రార్థిస్తూ కనిపించారు.
ఇందుకు సంబందించిన వీడియోను వీఐటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
🔴వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించాయి.
🔴ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.#AyudhaPoojai #Robots #Robotics #Automation @VIT_univ pic.twitter.com/NEpwsVYwlq— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 4, 2022