రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెష్ లు తెలుపుతున్నారు. కాగా యష్ 1986 జనవరి 8న కర్ణాటక లో జన్మించారు. అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 2016లో తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రాధిక పండిట్ ను పెళ్లి చేసుకున్నారు యష్. కాగా వీరికి ఇద్దరు సంతానం.
నేడు ఈ యంగ్ హీరో 35 వ పుట్టినరోజు వేడుకలను తన భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. రాధిక తో కలిసి కేక్ కట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు యష్ నటిస్తున్న కేజిఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించి టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.