ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కె.జి.ఎఫ్. ఈ చిత్రంతో యశ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2లో నటిస్తున్నాడు. ఇటీవల జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై మరింత అంచనాలను పెంచారు చిత్రయూనిట్..
అయితే సోషల్ మీడియా లో గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ కు అయిన ఖర్చు, యశ్ రెమ్యునరేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సినిమాలో మెయిన్ లీడ్ అయిన యశ్ కు 30 నుంచి 35 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. అంతేకాకుండా సినిమాకు వచ్చే లాభాల్లో కూడా షేర్ ఉందని తెలుస్తోంది. అది తెలుసుకున్న నెటిజన్స్ ఒక్క సినిమాతో ఇంత క్రేజా అంటూ షాక్ కి గురి అవుతున్నారు.