పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం రారాజు. కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ రెండో వారంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను డైరెక్టర్ వి వి వినాయక్ విడుదల చేశారు.
ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. రియల్ లైఫ్ కపుల్ యష్-రాధిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. అందుకే ఇది తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకర్షిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పైగా కేజీఎఫ్ రెండు భాగాలతో యష్ కు టాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బి, సి సెంటర్ ఆడియన్స్ కూడా ఈ హీరోకు బాగా కనెక్ట్ అయ్యారు.
అందుకే రారాజు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్నారు. జూన్ లో ఓ మంచి డేట్ కోసం చూస్తున్నారు. ఈ మేరకు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. మహేష్ రావు ఈ సినిమాకు దర్శకుడు.
జూన్ లో స్ట్రయిట్ సినిమాల తాకిడి ఎక్కువగా ఉంది. మొదటి వారంలో మేజర్, రెండో వారంలో అంటే సుందరానికి, మూడో వారంలో విరాటపర్వం సినిమాలు ఆల్రెడీ లాక్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి జూన్ నాలుగో వారంలో మాత్రమే గ్యాప్ ఉంది. ఆ డేట్ కు ఇప్పటివరకు ఎవరూ సినిమా ఫిక్స్ చేయలేదు. సమ్మతమే, గ్యాంగ్ స్టర్ గంగరాజు లాంటి సినిమాలున్నప్పటికీ రారాజు బరిలో దిగితే అవన్నీ పక్కకు తప్పుకోవడం ఖాయం.