బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ పదవీ కాలం ముగియనుంది. ఆయన తర్వాత ఆ పదవికి ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై పలు ఊహాగానాలు వెలుపడ్డాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ బఆల్‌రౌండర్ రోజర్ బిన్నీని ఎన్నికకు రంగం సిద్ధమైంది.
ఆ పదవిలో బిన్నీ మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ నెల 18న ముంబైలో బోర్డు ఏజీఎమ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలోనే ఆయన అధికారికంగా బోర్డు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పని చేసిన అనుభవం బిన్నీకి వుంది. ఇక బీసీసీఐ కార్యదర్శి జైషా మరోసారి అదే పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బోర్డ్‌లో మాత్రం ఇండియా ప్రతినిధిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని జైషా భర్తీ చేయనున్నారు.
బీసీసీఐ ట్రెజరర్ గా ఆశిష్ శేలార్ ఎంపిక కానున్నారని తెలుస్తోంది. ఇక వైస్ ప్రెసిడెంట్ పదవీలో రాజీవ్ శుక్లా కొనసాగనున్నట్టు సమాచారం. అభ్యర్థులందర్నీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అందుకే ఏ పదవికి ఎన్నికలు జరగవని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.