మయన్మార్ నుంచి ఇండియాకు అక్రమంగా వలసవచ్చిన రోహింగ్యాల గురించి కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో వారు నివాసం ఉంటున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ, తెమయన్మార్ నుంచి ఇండియాకు అక్రమంగా వలసవచ్చిన రోహింగ్యాల గురించి కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో వారు నివాసం ఉంటున్నట్టు ప్రకటించింది. లంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వారు ఉంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ రాజ్యసభలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు.
దేశంలోకి వచ్చిన రోహింగ్యాల్లో ఎవరికీ సరైన పత్రాలు లేవని, అందరూ అక్రమ పద్ధతుల్లో వచ్చారని ఆయన చెప్పారు. అయితే అలా ఎంత మంది దేశంలోకి వచ్చి ఉంటారన్నదానిపై లెక్కలు లేవని కేంద్ర మంత్రి తెలిపారు. అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి వెనక్కి పంపాలంటే.. దానికి ముందు వారి జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి.