అందరూ అనుకున్నట్టే జరిగింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి రోహిణి ఎగ్జిట్ అయింది. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో శివజ్యోతి త్యాగంతో హౌస్‌లో కొనసాగాల్సిన రోహిణి.. ‘గుసగుసల’ కారణంగా బిగ్‌బాస్ ఆగ్రహానికి గురై ఎలిమినేషన్ లిస్టులో చేరింది. థర్డ్ వీక్ హౌస్ నుంచి బయటికి వెళ్లిన తమన్నా సింహాద్రి.. ‘ఇలాంటి మనిషి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటమే వేస్ట్’ అంటూ రోహిణి గురించి కామెంట్ చేసినప్పుడే ఈమెకేదో మూడిందని అందరూ ఒక అంచనాకు వచ్చేశారు.
బిగ్‌బాస్ సీజన్ త్రి కంటెస్టెంట్స్ అందరిలోనూ రోహిణి మొదటి నుంచి హౌస్‌లో కాస్త హుందాగా ఉంటూ వచ్చింది. హౌస్‌లోకి ఎంటరయ్యేప్పుడు కింగ్ నాగార్జుననే ఇమిటేట్ చేస్తూ..సందడి సందడిగా లోపలికి వచ్చిన రోహిణి.. అక్కడ తనలాగే కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండే అషురెడ్డితో జత కట్టి వివాదాలకు దూరంగా వుంటూ హౌస్‌లో నెట్టుకొచ్చింది. కాకపోతే.. స్క్రీన్ పెద్దగా షేర్ చేసుకోకపోవడమే లోపంగా ఆడియెన్స్ ఓటింగ్ ఆధారంగా బిగ్‌బాస్ రోహిణిని ఈవారం ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవు. దానివల్లే రోహిణి ఎక్కువగా హైలెట్ కాలేకపోయింది. ఆడియెన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఓటింగ్‌లో తేడా కొట్టేసి బయటికి రావాల్సివచ్చింది. రోహిణి నామినేషన్‌కు తానే కారణమని తీన్మార్ అక్క శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. బయటికి వెళ్తూ వెళ్తూ రోహిణి తోటి హౌస్మేట్స్ అందరికీ మంచి మార్కులే వేసింది. బిగ్‌బాస్ సీజన్ త్రి మొత్తానికి హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న తన నేస్తం శ్రీముఖికి మాత్రం 50 మార్కులే ఇచ్చి సరిపెట్టింది. శ్రీముఖి బయట ఉన్నంత సరదాగా హౌస్‌లో లేదని.. అస్తమానూ ఆమె మైండులో గేమ్ స్ట్రాటజీలు ప్లే అవుతున్నాయని కామెంట్ చేసింది.