వెస్టిండీస్ తో జరుగుతున్న టీ-20 సిరీస్ ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. భారత టెస్టు జట్టు కెప్టెన్ గా నియమించింది. ఇప్పటికే టీమిండియాకు లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ గా ఉన్న హిట్ మ్యాన్.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ లోనూ జట్టును నడిపించనున్నాడు.
త్వరలో శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఫుల్ టైమ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపడతాడని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తెలిపారు. టెస్టు కెప్టెన్సీకి రోహిత్ చక్కగా సరిపోతాడని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.
శ్రీలంకతో టెస్టు, టీ-20లకు బుమ్రాను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది బీసీసీఐ. మరోవైపు పుజారా, రహానెలపై వేటు పడింది. కొంతకాలంగా వీరిద్దరూ విఫలం అవుతున్నారు. అందుకే పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. కొత్తగా టీమ్ లోకి కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, ప్రియాంక్ పాంచల్ కు చోటు దక్కింది.
శ్రీలంకతో సిరీస్ లకు భారత జట్లు
టీ-20 టీమ్- రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హూడా, బూమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, సంజు శాంసన్, చాహల్, జడేజా, కుల్దీప్ యాదవ్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్
టెస్టు టీమ్- రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభమన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ భరత్, ఆర్ అశ్విన్, జడేజా, జయంత్ ఠాకుర్, కుల్దీప్ యాదవ్, బూమ్రా(వైస్ కెప్టెన్), షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.