టీంఇండియా డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పబోతున్నారా…? అంటే అవుననే తెలుస్తోంది. ధోనీ నుండి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ…ఇప్పుడు ఆ బాధ్యతను రోహిత్ శర్మకు అప్పగించబోతున్నట్లుగా బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉండబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది.
ప్రస్తుతం టెస్ట్, వన్డే, టీ20లకు కోహ్లీయే కెప్టెన్ కాగా… రోహిత్ శర్మ వైఎస్ కెప్టెన్ గా ఉన్నారు. వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉన్న రోహిత్ కు వన్డేలతో పాటు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా టీ20 ఫార్మాట్ అప్పగించి… క్రమంగా వన్డేలు, టెస్టులు అప్పగించాలా… లేదా టీ20లతో పాటు వన్డేలు కూడా ఒకేసారి అప్పగించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisements
కోహ్లీ కెప్టెన్సీ సక్సెస్ రేటు 70.43శాతం.