హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు దూకుడు మీద ఉంది. రెండవ టీ 20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై 49 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ–20 సిరీస్‌ను భారత జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది.
ఇది ఇలా ఉంటే కెప్టెన్ గా రోహిత్ కు ఇది వరుసగా పంతొమ్మిదవ విజయం కావడం గమనార్హం. దీంతో గతంలో కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా రికీపాంటింగ్(20) పేరిట ఉన్న రికార్డుకు రోహిత్ అడుగు దూరంలో ఉన్నాడు.
నేడు ఇంగ్లాండ్ తో జరిగే మూడో టీ-20లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుంది. దీంతో పాటు కెప్టెన్ గా రికీ పాంటింగ్ రికార్డును రోహిత్ సమం చేయనున్నాడు. ఇప్పటికే టీ-20ల్లో అత్యధిక వరుస విజయాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించారు.
2019లో టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు స్వీకరించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు కెప్టెన్ గా వరుసగా 19 విజయాలు రోహిత్ అందించారు. అందులో 14 విజయాలు టీ-20ల్లోనే రావడం విశేషం.
మరో రికార్డుకు అడుగు దూరంలో హిట్ మ్యాన్