రోహిత్ శర్మ అనగానే తన సిక్సర్లు, మ్యాచ్ విన్నింగ్ ఆట గుర్తుకొస్తుంది. అయితే, రోహిత్ శర్మ పోలికలతో ఓ వ్యక్తి పాక్ లో కనిపిస్తే… అదేంటీ రోహిత్ పాక్ కు ఎప్పుడొచ్చాడు, అసలే ఇతర దేశాల క్రికెటర్లు ఎవరూ పాక్ కు రామని చెప్తున్న దశలో రోహిత్ కు ఇక్కడేం పని అని అంతా అనుకుంటారు.
నిజమే కానీ అచ్చం రోహిత్ ను పోలిన ఓ వ్యక్తి పాక్ రోడ్లపై కనిపించాడు. పాకిస్తాన్ లోని రావల్పిండిలో రోడ్లపై చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని ఓ వ్యక్తి ఫోటోలకు చిక్కాడు. అచ్చం రోహిత్ లాగే ఉండటంతో పాక్ లో రోహిత్ శర్మ అంటూ ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈయన లో బడ్జెట్ హిట్ మ్యాన్ ఉన్నట్లున్నారని ఒకరు, అసలే ముంబై వరుస ఓటములతో రోహిత్ హీటెక్కిపోయాడు… అందుకే ఆ కూల్ డ్రింక్ అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.