వన్డేల్లో పరుగుల వరద పారించి… టెస్ట్ జట్టులో స్థానం సొంతచేసుకున్న ఆటగాడు రోహిత్ శర్మ. వన్డే ఆటగాడు టెస్ట్‌లకు పనికిరాడు అంటు అనేక విమర్శలకు ఒక్క సెంచరీతో సమాధానం చెప్పాడు రోహిత్. హిట్ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్న రోహిత్… తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్‌లోనే భారీ సెంచరీతో అదరగొట్టాడు. 23ఫోర్లు, 6 సిక్సర్లతో మొత్తం 176 పరుగులు చేసి… భారత్‌కు మంచి పునాది వేశాడు. ఇక టెస్టుల్లోనూ తన ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకున్నాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీ పూర్తిచేసి, నిలకడ ఆడుతున్నారు.