ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా పది వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో బుమ్రా, రోహిత్ శర్మ, మరో ఓపెనర్ ధావన్ నిలకడగా ఆడడంతో భారత్ ఒక్క వికెట్టు కూడా నష్టపోకుండా 18.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు.
అయితే ఈ క్రమంలోనే రోహిత్ కొట్టిన ఓ భారీ సిక్స్ ఓ చిన్నారిని తాకి బాధించింది. ఐదో ఓవర్‌లో డేవిడ్ విల్లీ వేసిన మూడో బంతిని ఫుల్ షాట్ ఆడిన హిట్ మ్యాన్ బలమైన షాట్ కొట్టాడు. అది కాస్త స్టాండ్స్‌లో ఉన్న ఓ బాలికకు బలంగా తాకింది. దాంతో ఆ పాప గట్టిగా ఏడుపు మొదలు పెట్టింది. నొప్పిన తట్టుకోలేక విలవిల్లాడింది.
ఈ విషయాన్ని బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్‌స్టోక్స్.. రోహిత్‌కు చెప్పాడు. ఇది తెలుసుకున్న హిట్‌మ్యాన్ కంగారు పడ్డాడు. ఈ క్రమంలో కొద్దిసేపు మ్యాచ్‌ను ఆపారు.తక్షణమే ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ పాప దగ్గరికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం ఎలా ఉందనేది సమాచారం తెలియలేదు.
అయితే ట్విట్టర్లో మాత్రం ఓ నెటిజన్.. ఆ పాప పేరు మీరా సాల్వి అని, ఆమె ప్రస్తుతం బాగానే ఉందని ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.