బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుని నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. అయితే 4వ సీజన్లో నటుడు అజిత్ విన్నర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అభిజిత్ కు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అభిజిత్ కు ఫోన్ చేసి కంగ్రాట్స్ తెలిపాడు. అంతేకాకుండా తన జెర్సీ పై విత్ లవ్ బెస్ట్ విషెస్ అంటూ సంతకం చేసి గిఫ్ట్ ఇచ్చాడు.
ఇక రోహిత్ శర్మ అమ్మగారు తెలుగు వారు కావడంతో తో ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం టీమిండియా జట్టులో తెలుగు క్రికెటర్ విహారి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ మధ్య బిగ్ బాస్ గురించి చర్చ వచ్చిందట. ఆసమయంలో తెలుగు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ అని చెప్పడంతో రోహిత్ ఈ గిఫ్ట్ పంపించాడట. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ వచ్చిందంటూ అభిజిత్ ట్వీట్ చేశాడు.