బుల్లితెరపై ఏళ్ళు గడుస్తున్నా తన మార్క్ చూపిస్తూ రేటింగ్స్ లో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ఇటీవల షో నుంచి నాగబాబు వెళ్ళిపోయినా సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచి జబర్దస్త్ కు వెన్నుముకగా నిలిచినా నాగబాబు వెళ్లిన ఆయన లేని లోటు కనిపించకుండా షో నిర్వాహుకులు చాలానే చేస్తున్నారు. ఈ మధ్య నాగబాబు స్థానంలో న్యాయనిర్ణేతగా సెలెబ్రిటీలను తీసుకొస్తున్నారు. స్కిట్ లో కూడా సెలెబ్రిటీలను పెట్టి చేయిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు రోజానే న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ షో ను ముందుండి నడుపుతున్నారు.
మరోవైపు నాగబాబు తో పాటు టీం లీడర్లు కూడా వెళ్లిపోవటటంతో ఎప్పటినుంచో అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కంటెస్టెంట్లు టీం లీడర్లు గా అవతారం ఎత్తుతున్నారు. గతంలో నాగబాబు ఉన్న సమయంలో ఒక టీం కు 10 పాయింట్ లు ఇచ్చేవారు. మిగిలిన టీంకు 9 పాయింట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పడు రోజా మాత్రం అందరికి 10 కి 10 పాయింట్స్ వేసేస్తున్నారు. దీనితో ప్రతి టీం కు ఇరవైఐదు వేలు దక్కుతుంది. గతంలో అన్ని టీంలకు 10 కి 10 వేసిన సందర్భాలు చాలా తక్కువ. మాములుగా 100 వ ఎపిసోడ్ లేదా రెండువందల ఎపిసోడ్ సమయంలో మాత్రమే ఇలా 10 కి 10 పాయింట్స్ ఇచ్చేవారు. టీమ్ లీడర్లు, పార్టిసిపెంట్లూ అందరూ విజేతల్లా ఫీలవుతూ… మరింత ఉత్సాహంతో కామెడీ పండిస్తున్నారు.
ఇప్పుడు నాగబాబు జబర్దస్త్‌లో ఉండి ఉంటే చాలా మందికి కొత్తగా టీమ్ లీడర్లు అయ్యే అవకాశం ఉండేది కాదు. ఆయన వెళ్లిపోవడం ఆయనతోపాటూ సీనియర్ టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కొత్త నీరు పారుతోంది. ఎప్పటి నుంచీ టీమ్ లీడర్లు అయ్యే అవకాశం దక్కక ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. ఆ జోష్‌లో వారు… తమలో ఇన్నాళ్లూ దాగివున్న టాలెంట్ అంతా ప్రదర్శిస్తూ తాము కూడా తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు.