జబర్ధస్త్ నుండి నాగబాబు ఎగ్జిట్ తర్వాత కొత్త జడ్జి కోసం వెతుకుతున్న మల్లెమాలకు ఇప్పట్లో సరైన జడ్జి దొరికేలా కనపడటం లేదు. నాగబాబు ప్లేస్‌ను రీప్లేస్ చేసేందుకు కమెడియన్ అలీ, సీనీయర్ నటుడు నరేష్, సాయికుమార్ ఇలా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్కరూ ఫిక్స్ కాలేదు.
తెలుగు సినిమా హీరోలపై పవన్ డైరెక్ట్ అటాక్
ఇక కొత్త జడ్జి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకునే వరకు రోజాతోనే సరిపెట్టాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది బాగానే ఉన్నా… ఎన్నాళ్లు ఇలా అనే డౌటే అందర్నీ వేదిస్తోంది.
లైంగిక వేధింపులతో నరకం అనుభవించాను
అయితే… కొత్త జడ్జి నియామకంలో నిర్వాహకులు పెడుతున్న షరుతులతోనే అంతా వచ్చినట్లే వచ్చి వెళ్లిపోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఇక్కడ షో చేస్తే వేరే షోలు చేయటం సరికదా… కనీసం ఈవెంట్లకు వెళ్లాలన్న తమ పర్మిషన్ తీసుకోవాలన్న కండిషన్ అందులో ముఖ్యమైనదట. అందుకే ఎవ్వరూ… షోను ఒకే చేయటం లేదని తెలుస్తోంది. కానీ నిర్వహాకులు కూడా అంతే పట్టుదలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా నాగబాబు స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో కానీ… రోజాకు బాధ్యత మరింత పెరిగింది. అయితే… పెరిగిన బాధ్యతలకు సరిపడా పారితోషికం కూడా పెరిగిందట.