ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్‌లో తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం రొమాంటిక్. ఫస్ట్‌లుక్ ఇప్పటికే రిలీజ్ కాగా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు పూరీ. ఈ చిత్రంలో పూరీ సరసన ఢిల్లీ మోడల్ కేతిక శర్మ నటిస్తుండగా… ఫుల్ మసాలా పిక్చర్ అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
రోమాంటిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… శనివారం సాయంత్రం 5గంటలకు ఫస్ట్ వీడియో సాంగ్ నువ్వు నేను ఈ క్షణం అనే పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆకాశ్-కేతికల మధ్య మాస్ మసాలా సాంగ్ ఇదేనని… ఈ పాటతో మరోసారి ఇండస్ట్రీ ఈ సినిమాపైనే మాట్లాడుకునేలా చేస్తారు అంటూ చర్చ నడుస్తోంది.
ఆంధ్రాపోరీ సినిమాతో అరంగ్రేటం చేసిన ఆకాశ్‌పూరి… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా సినిమాలో నటించాడు. కానీ అవేవీ పెద్దగా హిట్ కొట్టకపోవటంతో… రొమాంటిక్‌తో ఎలాగైనా కొడుక్కు బ్లాక్ బాస్టర్ అందించాలన్న కసితో ఉన్నాడు పూరీ.
పూరీకి తోడుగా హీరోయిన్ చార్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా… అనిల్ పాదూరి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఇక కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అన్నీ పూరీయే. అనుకన్న సమయానికి చిత్రీకరణ పూర్తయితే… ప్రేమికుల రోజు గిఫ్ట్‌గా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు పూరీ.
హైపర్ ఆది వర్మ ఫాన్స్ మధ్య వార్
వెబ్ సిరీస్‌లోకి మరో హాట్ హీరోయిన్