డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకఉ పూరీ ఆకాష్ హీరోగా నటించిన రెండో సినిమా `రొమాంటిక్`. ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. రొమాంటిక్ మూవీని జూన్ 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చింది.
ఫస్ట్ మూవీ మెహబూబా బోల్తాకొట్టడంతో… ఫుల్ రొమాన్స్ కథతో రెండో సినిమా చేశాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో `రొమాంటిక్` సినిమా తెరకెక్కింది. ముంబై మోడల్ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమాను తెరకెక్కించగా… సినిమాలో రొమాన్స్ ఎంతలా ఉంటుందో పోస్టర్లను చూస్తే అర్థమైపోతుంది. ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.