ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు హీరోగా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మే 29 న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికి సంబందించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఆకాష్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటాడో తెలియాలంటే మే 29 వరకు ఆగాల్సిందే.