సంక్రాంతి వచ్చేస్తుందంటే చాలు… పందెం కోళ్ల హావా పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుండి గోదావరి జిల్లాలకు ఈ కోడి పందెం చూడటానికి, ఆడటానికి ఉత్సాహాం చూపిస్తుంటారు. పందేలు జరిగే ప్రాంతం ఓ జాతరను తలిపిస్తుంటుంది. ఒక్కో ఆటకు లక్షల్లోనే చేతులు మారుతుంటాయి. ఈ కోడి పందేల కోసం ఎప్పటి నుండో కోళ్లను పెంచుతుంటారు. అయితే కోళ్లను పెంచకుండా కూడా మీరు పందేం నిర్వహించవచ్చు.
మొబైల్ చేతిలో ఉంటే చాలు… మార్కెట్ మన చేతిలో ఉన్నట్లే. అందుకే పందేం కోళ్లను కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేస్తున్నారు. కోడిని బట్టి రేటును ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. ఒక్కో రకం కోడికి ఒక్కో పేరు పెడుతున్నారు. డేగ, కాకి, రసంగి, నెమలి ఇలా పక్షుల పేర్లతో కోళ్లను పిలుస్తున్నారు.
సంక్రాంతి కోసం ఎదురుచూస్తు పందెం కోళ్లను నాటు గుడ్లు, పాలు, బాదం, జీడిపప్పు, ఖర్జూరం ఇలా ప్రతి రోజు ఒక్కో కోడికి 50-100రూపాయల ఖర్చుతో కోళ్లను పెంచుతుంటారు. మరికొందరైతే తమ కోళ్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంటారు. దాంతో అందుకు తగ్గట్లుగానే ఒక్కో కోడి రేటును నిర్ణయిస్తున్నారు.
గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ పందెం కోళ్లకు ఎంత గిరాకీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొందరైతే ఈ పందెం కోళ్ల పెంపకం ఓ బిజినెస్‌గా మార్చుకొని మరీ అమ్మకాలు చేపడుతున్నారు. నూజీవీడ్ కాక్స్, జాతికోళ్ల పెంపకం, జాతికోళ్ల పెంపకం సేల్స్ ఇలా రకరకాల పేర్లతో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లోనే నచ్చిన కోడికి ఫలనా రేటు అని నిర్ణయించి అమ్మేస్తున్నారు.