బీహార్ లోని రత్నగిరి కొండల్లో 1969 విశ్వశాంతి స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొండల సౌందర్యాన్ని చూడడానికి , అక్కడి అనేక మఠాలను సందర్శించడానికి కొండలపై నడక కష్టతరమవ్వడంతో …. ఆ సమయంలో జపాన్ కు చెందిన బౌద్ద సన్యాసి అయిన ఫూజీ గురు రోప్ వే ను వేయించాడు. 1000 ఫీట్ల ఎత్తులో కేవలం ఒక మనిషి మాత్రమే ప్రయాణించడానికి వీలయ్యే క్యాబిన్లను తయారు చేయించాడు. మొత్తం 101 క్యాబిన్లు ఉన్నాయి. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు ఈ రోప్ వే లను ఎక్కే అవకాశం లేదు.
అయితే …ఈ రోప్ వే లను అప్ గ్రేట్ చేయడం కోసం బీహర్ ప్రభుత్వం 2018 లోనే పునాధి వేసినా ఆ పని ఇంకా నత్తనడకనే కొనసాగుతుంది. 2020 వరకు కొత్త రోప్ వేలను వాడకంలోకి తేవాలని నిర్ణయించుకున్నా ఇంకా ఆ పని పెండింగ్ లోనే ఉంది.ఒకేసారి 8 మంది కూర్చొని ప్రయాణించడానికి అనువుగా ఉండేలా , కొత్త టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేస్తున్న ఈ రోప్ వే పూర్తవ్వడానికి మరికొంత సమయం పట్టొచ్చు.!