మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఆదివారం వరకు రోశయ్య పార్థివ దేహాన్ని ఆయన ఇంటి వద్దనే ఉంచనున్నారు. ఉదయం 9. 30 నిమిషాలకు గాంధీ భవన్ కు తీసుకువెళ్లనున్నారు. మధ్యాహ్నం 1గంటకి మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరపనున్నారు. అలాగే మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రోశయ్య ఇంటికి వెళ్లనున్నారు.
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా ఎన్నో ఏళ్ళు కొనసాగారు రోశయ్య. అలాగే తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేశారు.