రొటోమాక్‌ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారి అరెస్ట్

రొటోమాక్‌ కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారి, ఆయన కొడుకు రాహుల్‌‌ని గురువారం అరెస్ట్‌ చేసింది సీబీఐ. 2008 నుంచి బ్యాంకుల నుంచి పొందిన భారీ రుణాలను (రూ. 3,695 కోట్లు)ఈ కంపెనీ, ఉద్దేశపూర్వకంగా వాటిని దారి మళ్లించింది. ఎగుమతుల పేరిట బ్యాంకుల నుంచి మంజూరైన రుణాలను, సొంత ప్రయోజనాలకు వినియోగించకున్నట్లు విచారణలో తేలింది.

అంతేకాదు ఎగుమతి ఆర్డర్ల కోసం నకిలీ పేపర్స్‌తో పొందిన అప్పును విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని, తిరిగి ఆ డబ్బును కాన్పూర్‌కు చెందిన కంపెనీకే మళ్లించినట్టు ఓ అంచనాకు వచ్చింది సీబీఐ. ఆ మేరకు కొఠారీ అండ్‌ టీమ్‌పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)లు వేర్వేరుగా కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే!