హైదరాబాద్ మహానగరంలో కనుమరుగైపోయిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్డెక్కించనున్నారు. ఇవి ఎంత వరకు వర్కవుట్ అవుతాయని పక్కనపెడితే… మంత్రి కేటీఆర్ మళ్లీ తిప్పగలమా అంటూ రవాణ మంత్రికి చెప్పటంతో మొదటి ఫేజ్ లో ఏకంగా 25బస్సులను తిప్పబోతున్నారు.
ఇప్పటికే అధికారులు రూట్ ఫిజబిలిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు పెరుగుతున్న నేపథ్యంలో… లిమిటెడ్ రూట్ లో బస్సులను తిప్పనున్నారు. గతంలో ఫేమస్ అయిన సికింద్రాబాద్-జూపార్క్ రూట్ ఈసారి ఉండకపోవచ్చు అంటున్నాయి బస్ బవన్ వర్గాలు.
డబుల్ డెక్కర్ కు ఓకే చేసిన రూట్స్-
సికింద్రాబాద్- మేడ్చల్ వయా సుచిత్ర
సికింద్రాబాద్- పటాన్ చెఱు వయా బాలానగర్ క్రాస్ రోడ్
కోఠి- పటాన్ చెఱు వయా అమీర్ పేట
అప్జల్ గంజ్- మెహిదీపట్నం