అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా రిలీజ్ సమయంలో వైఫ్‌ను కొడితే తప్పేంటీ… కొట్టుకుంటున్నారు అంటేనే లవ్ ఉంది అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అప్పట్లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా ఇటువంటి మాటలే మాట్లాడితే బాలీవుడ్ మొత్తం విరుచుకుపడింది. టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సీ కూడా ఈ విషయంలో గట్టిగానే స్పందించింది. ముక్త కంఠంతో గృహ హింసను ఎలా ప్రోత్సహిస్తారు అని ప్రశ్నించింది.
తాజాగా మరోసారి ఇదే తరహా వాదనతో ట్రోల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా క్రిటిక్ అనుమప చోప్రా చేస్తున్న ఓ షోలో విజయ్ మరోసారి భార్యను కొడితే తప్పేంటీ…? అంటూ కామెంట్ చేశారు.
100 గ్రేటెస్ట్ ఫర్ పార్ఫ్మెన్స్ ఆఫ్ ది డికేడ్ బై అనుపమ చోప్రా చేసిన షోలో తన నోటి దురుసుతో మరోసారి ట్రోల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా షోలో… బాజీరావ్ మస్తానీ నుండి రణ్‌వీర్ సింగ్, పీకు సినిమా నుండి దీపికా, హైవే సినిమా నుండి అలియాభట్, అర్జున్‌రెడ్డి నుండి విజయ్‌దేవరకొండ, గ్యాంగ్స్ ఆఫ్ వస్సాయ్‌పూర్, అలీగర్ నుండి మనోజ్ బాజ్‌పేయ్, ఉయారీ సినిమా నుండి పార్వతీ తిరువొత్తు తదితరులు హాజరయ్యారు.