ఓ రౌడీ షీటర్ అంతిమ యాత్రలో రౌడీ షీటర్లు, జులాయిలు కత్తులతో రెచ్చిపోయారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ వారిని ఏమి అనలేకపోయారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సంచలనం రేపింది. సుమన్ అనే రౌడీషీటర్ ను కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు.
ఈ క్రమంలో సుమన్ అంతిమ యాత్రకు రౌడీ షీటర్లు, జులాయిలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ వారిని ఏ మాత్రం లెక్క చేయకుండా రౌడీషీటర్లు కత్తులు తిప్పుతూ హల్‌చల్ చేశారు.
రెండు సార్లు రౌడీలు పోలీసుల మీదకు రావడంతో లాఠీలకు పని చెప్పారు.ఫ్రెండ్లీ పోలీసుల వల్లే రౌడీ షీటర్లు ఇలా ప్రవరత్ఇస్తున్నారంటూ జనాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.