ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళల పట్ల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముసలి, ముతక అన్న తేడా లేకుండా పసివారిపై సైతం తమ పైశాచికం కామాంధులు చూపిస్తున్నారు. తాజాగా విజయవాడలో మరో చిన్నారి పై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పిన రౌడీ షీటర్ చిన్నరాజా అమ్మాయిని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లితండ్రులు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్ పై పోస్కో చట్టం కింద కేసు నమాదు చేశారు.