హీరో సాయి తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తనదైన రీతిలో స్పందించాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడని తేజ్ పై కేసు పెట్టారు సరే. మరి.. రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన వారిపై, రోడ్లు శుభ్రం చేయించని సంబంధిత అధికారులపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశాడు.
ఈ విధంగా కేసులు పెడితే ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడే ఛాన్స్ ఉందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు ఆర్పీ పట్నాయక్. అలాగే సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. ఇక తేజ్ కు కాలర్ బోన్ విరిగినట్లు ఇప్పటికే నిర్ధారించిన వైద్యులు… ఇతరత్రా అంతర్గత గాయలేమైనా ఉన్నాయా అని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షిస్తున్నారు.