సైదాబాద్ లో జరిగిన దారుణం పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఆర్ పి పట్నాయక్ ఇదే విషయమై స్పందించారు. చిట్టితల్లి కి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మ శాంతించాలంటే, ఈ పల్లకొండ రాజు దొరకాలి. హైద్రాబాద్ సిటీ పోలీస్ విడుదల చేసిన ఈ ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డ్ ప్రకటించారు.
నా వంతుగా ఆ పట్టించిన వారికి 50,000 ఇస్తాను.
కానీ ఇతను దొరకాలి….పోలీసులు ఇచ్చిన అన్ని క్లూస్ మనకి హెల్ప్ కావొచ్చు, కాకపోవచ్చు కానీ చేతిపై “మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతన్ని పట్టించేలా చేస్తుంది. అతను మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఈ నెరస్తుడిని పట్టుకునే పనిలో మనం కూడా సహకరిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.