రాజస్థాన్ రాయల్స్ మరోసారి తన సత్తా చాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో 217 పరుగులు చేసింది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరగులు చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు సృష్టించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు జోష్ బట్లర్, దేవదత్ పడిక్కల్ లు శుభారంభాన్ని ఇచ్చారు. జోష్ బట్లర్ 103(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 24 (18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చేశారు.
మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత సంజూశాంసన్ 38, షిమ్రాన్ హెట్ మెయ్యర్ 26 తో స్కోర్ బోర్డును బట్లర్ పరుగులు పెట్టించాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేయగలిగింది.
లక్ష్య చేధనకు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సునిల్ నరైన్ కనీసం ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసి మరో ఓపెనర్ అరోన్ ఫించ్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
వీరిద్దరూ కలిసి 107 పరుగులు చేశారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కు నితీశ్ రానా కొంత మేరకు సహాయం అందించినా ఆ తర్వాత వచ్చిన వారు వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఆరు వికెట్ వద్ద శ్రేయస్ వెనుదిరగగా చివర్లో ఉమేశ్ యాదవ్ ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్ కతా 210 పరుగులకు ఆలౌట్ అయింది.
Advertisements
ఇక ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ 200 లకు పైగా పరుగులు చేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. అంతకు ముందు అత్యధిక పరుగుల రికార్డు 216/4 చెన్నయ్ పేరిట ఉండేది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఏప్రిల్ 12న చెన్నయ్ ఈ రికార్డును సృష్టించింది.