ఎప్పుడు నోటిఫికేషన్స్ పడుతాయా అని వెయ్యి కళ్లతో నిరుద్యోగులు ఎదురు చూస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో కొందరు వీరి బలహీనతో ఆడుకుంటున్నారు. తాజాగా RRB ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అధికారికంగా ఎలా నోటిఫికేషన్ వస్తుందో… అచ్చం అలాగే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. కానీ రైల్వే బోర్డు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు.
ఫేక్ నోటిఫికేషన్ ప్రకారం మార్చి 13, 2020న ఎగ్జామ్ ఎక్కడుంటుంది, ఎప్పుడనేది అనేది చెప్తాం అంటూ ప్రకటించారు.
అయితే, సీబీటీ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నామని, జూన్-సెప్టెంబర్ మధ్యలో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయని బోర్డు గత అక్టోబర్ 14న చివరి సారిగా అధికారికంగా ప్రకటించింది. రద్దయిన పరీక్షలు ఎప్పుడనేది RRB వెబ్‌సైట్‌లో పెడుతాం అని ప్రకటించారు.
ఎందుకు పరీక్ష రద్దయింది అనే కారణాలు తెలియకపోయినా… RRBపరీక్షల కోసం దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. అన్నీరకాల ఉద్యోగాలు కలిపి లక్షా ముప్పైఐదు వేల ఖాళీలున్నట్లు తెలుస్తోంది.