వరుసగా రెండో రోజు ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో రెండో రోజు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఏపీ, నైజాంలో విడుదలైన ఈ 2 రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ పరంగా చూసుకుంటే ఈ మొత్తం 105 కోట్ల రూపాయల 74 లక్షల రూపాయలు.
నైజాంలో ఈ సినిమా 2 రోజులకే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ అందుకుంది. కేవలం నైజాంలోనే కాకుండా.. అన్ని తెలుగు ప్రాంతాల్లో ఈ సినిమా అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. సీడెడ్, వెస్ట్, గుంటూరులో అయితే కలలో కూడా ఊహించని నంబర్లు నమోదయ్యాయి.
అటు నార్త్ లో మాత్రం ఆర్ఆర్ఆర్ కు భారీ వసూళ్లు రావడం లేదు. తొలి రోజు వసూళ్లలో బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయిన ఆర్ఆర్ఆర్, రెండో రోజు కూడా యావరేజ్ గా వసూళ్లు సాధించింది. ఈ 2 రోజుల్లో నార్త్ నుంచి ఆర్ఆర్ఆర్ కు కేవలం 40 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే బాహుబలి-2 సినిమాకు తీసుకుంటే 2 రోజుల్లో 69 కోట్లు.. సాహో సినిమాకు 2 రోజుల్లో 50 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ,నైజాంలో 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 38.45 కోట్లు
సీడెడ్ – రూ. 22.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 11.40 కోట్లు
ఈస్ట్ – రూ. 6.97 కోట్లు
వెస్ట్ – రూ. 6.88 కోట్లు
గుంటూరు – రూ. 9.61 కోట్లు
నెల్లూరు – రూ. 3.86 కోట్లు
కృష్ణా – రూ. 6.07 కోట్లు